ఇద్దరు ఎంపీ ల మధ్య జరిగిన సంభాషణ(??)
*********************************************
"ఆ! చెప్పావులే పెద్ద.."
"నువ్వు నాకు నీతులు చెప్తే వినాలి, నేను చెప్తే తప్పా?"
"ఎక్కువ మాట్లాడుతున్నావ్"
"ఎవడయ్యా? నువ్వా?నేనా?"
"ఇంక మాట్లాడింది చాలు నోర్మూసుకో"
"నువ్వే మూసుకో"
"నిన్న కాక మొన్నొచ్చావ్ నువ్వు నాకు చెప్పేటంతోడివయ్యావా?"
"ఏయ్ వాడు గీడు ఏంటి?మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం తెలీదా?"
"పోరా!, నీ మొహానికో మర్యాద కూడానా?"
"దమ్ముంటే బయటికి రా చూసుకుందాం"
"ఆ!పద, నువ్వు మగాడివో నేను మగాడినో తేల్చుకుందాం.."
**************************************************
ఇదండీ సంగతి. వాళ్ళిద్దరూ అంత చక్కగా మాట్లాడుకుంటే ఈ మీడియా ఏమిటండీ ఇలా ప్రతిదాన్నీ వివాదాస్పదం చేస్తోంది?
Subscribe to:
Post Comments (Atom)
ఒక సినిమా-కొన్ని జ్ఞాపకాలూ
న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో. (తెలియని వారికి: అమెరికాలో...
-
" ఏమిటి , వెళ్ళక తప్పదా ?" " నీ ఇష్టం " మూడక్షరాల సమాధానమైనా , ముప్పై మూడు విరుపులు వినపడ్డాయి నాకు . అలవాటు ప...
-
వెకిలితనానికీ, అవకాశవాదానికీ తావివ్వని అమాయకత్వం మూర్తీభవించిన వయసది. ఆ భావనల పరంగా అ ఆ లు దిద్దుకుంటున్న అందమైన వయసది.. ******************...
-
కొన్ని నెలల క్రితం నేనొకసారి టెన్నిస్ ఆడడానికి మా ఇంటి దగ్గర్లో, ఒక పార్క్ లోనున్న టెన్నిస్ కోర్టుకెళ్ళాను. ఉన్నవే రెండు కోర్టులు. ఒకదాంట్...
8 comments:
ఇప్పుడేం చూసారు రేపు ఒక bc mp ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అవమానించిన రాజగోపాల్ క్షమాప్పన చెప్పేదాకా అతనిని హైదరాబాద్ లో తిరగనివ్వం అంటూ statement లు వస్తాయి చూస్తూ ఉండండి.
@ravigaru:
ఇదొక "అరాచకీయం". ప్రజా సేవ పారిపోగా మిగిలిన residue
:) విశేషమేంటంటే..
ఈ సౌహార్ద్ర సంభాషణను తెదేపా విమర్శించింది. అదే రోజున వాళ్ళ ఎంపీ ఒకడికి కోర్టు జైలు శిక్ష ఖాయం చేసింది. (గతంలో ఓ పోలీసును కొట్టినందుకు) మహారాష్ట్రలో దౌర్జన్యాలు, హింసాయుత దాడులు చేయించినందుకు ఒకణ్ణి పట్టుకుని రిమాండుకు పంపారు. అంతకు ఓ రోజు అటో ఇటో.. దొంగ పాసుపోర్టు సృష్టించినందుకుగాను ఓ లోక్‌సభ సభ్యుణ్ణి సభనుంచి సస్పెండో మరోటో చేసారు.
మురికెదవలు రాజకీయాల్లోకి దిగుతున్నారో, దిగాక మురికి అవుతోందోగానీ..
ఇంకో విశేషం ... ఒక తెలంగాణా ఎంపీని ఆంధ్రా ఎంపీ అవమానించాడని తెలంగాణా వాదులు అప్పుడే (వితండ) వాదం కూడా మొదలుపెట్టారు ... వాడిని వీడు తిడితే వీడిని వాడు కూడా తిట్టాడు కదా ... :)
- Shiv.
@చదువరి, Shiv
ఏ పార్టీ అయినా అదేతంతు. చూసి చూసి మనకి విరక్తి కలగాల్సిందే. వాళ్ళకు మాత్రం అలుపూ సొలుపూ ఉండదు,ఆలోచన అసలేమాత్రం ఉండదు.
Why same comment of mine appeared thrice? is it a kind of spam?????
Post a Comment