వారసులొచ్చేస్తున్నారు జాగ్రత్త!!

Tuesday, November 25, 2008

గుండమ్మకధ.
అప్పుడు నేను చదివేది ఏ ఆరో తరగతో, ఏడోతరగతో.
అప్పటికి గుండమ్మకధ ఏ పదో రిలీజో, పదకొండో రిలీజో.మ్యాటినీ హవుస్ ఫుల్. ఈసురో మని వెళ్తే ఫషో మళ్ళీ హావుస్ ఫుల్. ఆ తరువాత ఒక రెండు రోజులకి గానీ దొరకలేదు టిక్కెట్లు.

ఎంటీఆర్, ఏఎన్నార్, రాజ్యన్నేలిన రోజుల్లో అందరూ పాపం చక్కగా వారి సినిమాల్ని ఎంజాయ్ చేసారు.వాళ్ళకి నీరాజనాలు పట్టారు. నెత్తికెక్కించుకున్నారు. ఏదో మర్యాదా, మన్ననలు కాలమేలిన రోజులు, నెత్తిమీద పెట్టుకున్నన్ని రోజులు పెట్టుకొని ఆ తరువాత దిగండి సారూ అంటే వారు కూడా మర్యాదగా దిగి అస్త్ర సన్యాసం చేస్తారనుకున్నారు గానీ ఇలా కొంప కొల్లేరు అవుతుందని సగటు ప్రేక్షకుడు ఎవడూ అనుకోలేదు. "హవ్వ! మనమరాలి వయసు అమ్మాయితో గంతులూ , కుప్పి గంతులూనా" అనుకున్నా, ఆ ఫీలింగుని కడుపులోనే దాచుకున్నారు, వారు వింటే బాధపడతారని. వారు నటించిన పాత చిత్ర రాజాలను చూసి పెద్దమనసుతో క్షమించేసారు. అంతటితో ఆగిందా? లేదు. రోజులు మారాయి. వాళ్ళూ మనలాంటి మనుషులేగా. వాళ్ళకంటూ ఒక కుటుంబం , పిల్లలూ...

ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యారు.మనకి గుది బండయ్యారు. అయినా భరించాం...
బక్క పలచగా ఉన్నా భరించాం...
బొద్దుగా ఉన్నా భరించాం..
మొదట్లో చాలా కష్టపడి పైకొచ్చి ఆ తరువాత నేను స్టార్ ని, నా కధలింతే మీ గతంతే..అంటే భరించాం...
తరం మారింది..
వీళ్ళూ యాభై, అరవైల్లోకొచ్చారు. వీళ్ళకీ ఒకటో రెండో పెళ్ళీళ్ళూ ఇద్దరో ముగ్గురో పిల్లలూ...
పాపం సగటు ప్రేక్షకుడికి ఇక చాలు బాబో అనే ఓపిక కూడా లేదు...
************************************

మొన్నీ మధ్య మేము నలుగురు ఫ్రెండ్స్ మి ఒక పార్టీ సందర్భంగా కలుసుకున్నప్పుడు ఇప్పుడున్న నటుల్లో(?) ఎవరెవరికి ఎంత మంది పిల్లలు, వాళ్ళ వయసెంత, ఇంకెంతమంది ఈ సినీలోకం మీద దాడికి రెడీ గా ఉన్నారు అని భయ భయం గా చర్చించుకున్నాం.
ఏమిటో, ఓ సంవత్సరం క్రితం పెళ్ళై, ఈ మధ్యే తండ్రైన నటుణ్ణి చూసినా భయపడాల్సొస్తోంది..హతవిధీ......

11 comments:

చైసా said...

ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. వారసులు తెరపైకి వస్తూనే ఉంటారు..మనం చూస్తూనే ఉండాలి.

నల్లమోతు శ్రీధర్ said...

:)

మధు said...

బాగా చెప్పారు!!

ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా బోడి వంశాలనుంచి కాకుండా స్వంతంగా నిలబండిన వాళ్ళు ఎంతమందో లెక్కేయండి..ఎంత మందొస్తారో చూద్దాం :)

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

బాగుంది,కానీ మధ్యలోనే అర్ధంతరంగా ఆపారు అనిపించింది,కొనసాగిస్తారా లేదా అని డిమాండ్ చేస్తున్నామిక్కడ

ఉమాశంకర్ said...

@చైసా, శ్రీధర్,మధు,రాజేంద్ర ప్రసాద్ గార్లకు:

మీ వ్యాఖ్య లకు ధన్యవాదాలు.

@ మధు గారు:
ఒకవేళ ఉన్నా కూడా వారి మనుగడ కోసం ఏదో ఒక కోటరీ లో ఉండాల్సిందే..ఖర్మ

@రాజేంద్ర ప్రసాద్ గారు:

ఏదో వెబ్ సైటు లో, అందరి కళ్ళూ ఆ "వారస రత్న" వైపే అని రాస్తే, ఇక్కడ మనమేదో వారి కోసం దేబిరిస్తున్నట్టు వాళ్ళు అనుకోవటమేమిటి అని, చిర్రెత్తుకొచ్చి, ఆవేశం గా రాసి పడేసా.

కొత్త పాళీ said...

good one.

ఉమాశంకర్ said...

@కొత్త పాళీ గారు: Thank you.

లలిత said...

రాజకీయాల్లోను, సినిమాల్లోను ఈ వారసుల బెడద ఎక్కువైపోయింది
ఈ చీడని వదిలించుకొనే మందు దొరక్క జనాలు వెర్రి చూపులు చూస్తున్నారు అదే వాళ్ళు ఎదురుచూపులనుకొని సంబరాలు చేసేసుకుంటున్నారు . ఇది ఈతరంతోనైనా ఆగుతుందా అని నా సందేహం

krishna rao jallipalli said...

ఎవరూ ఏమీ ఆశలు పెట్టుకోవద్దు. మొన్ననే నాగార్జున పెద్దకొడుకు, అటుమొన్న బాబు మోహన్ కొడుకు, త్వరలో వెంకటేష్ కొడుకు, ఇంకా నాగాబాబు కొడుకు , నాగార్జున రెండో కొడుకు., సారీ మంచు మనోజ్ కుమార్ కి కూడా పెళ్లి అయ్యింది కదా... తొందర పడొద్దు. నిజం చెప్పలంటీ వీరందరినీ ఏమీ అన కూడదేమో.. ఎందుకంటే మనం కూడా విరగబడి, చంకలు కొట్టుకుంటూ, సొల్లు కార్చుకొంటూ, జేజేలు కొట్టుకుంటూ, ఇరగబడి, గుడ్డలు చించుకుంటూ, వేరే ఏమీ దిక్కు దివాణం లేనట్టు... పోషిస్తున్నాము కదా.

Bhavani said...

వాళ్ళను అనుకొని ఏం లాభం చెప్పండి.
మన జనమో?? తరతరాల వాళ్ళని పెద్దమనసుతో ఆదరించేస్తారు. ఎంత మనకి వేరే చాయిస్ లేకపోతే మాత్రం అలా చెయ్యాలా? చచ్చిపోయేలోపు మనకి వీళ్ళ నుండి విముక్తి లభిస్తుందో లేదో తెలియటం లేదు.

ఉమాశంకర్ said...

@ Bhavani,

నిజమే, సినిమా అంటే వల్లమాలిన అభిమానం పెంచుకున్న ప్రేక్షకులదికూడా తప్పే ఈ విషయంలో..

కానీ ఎలాంటి సినిమాలు చేస్తున్నాం అనే కనీసపు ఆలోచన ఆ సోకాల్డ్ స్టార్లకు లేకపోవడం.. :(

 
అనంతం - by Templates para novo blogger