అమెరికా సిత్రాలు

Wednesday, November 19, 2008

నేను కార్లో పెట్రోలెప్పుడూ కాస్ట్కో లోనే పోయిస్తా వీలైనంత వరకు. ఇంజనుకి రక రకాల పెట్రోలు తాగించే బదులు ఎపుడూ ఒకేరకమైంది తాగిస్తే మంచిదనే గుడ్డి నమ్మకం, కాస్ట్కో కంపనీ మీదున్న నమ్మకం, పైగా అక్కడ ఒక రెండు సెంట్లు తక్కువుండడం అనేవి వేరే కారణాలు. నా ఆఫీసు కొచ్చేదారిలో దాదాపు అయిదు పెట్రోలు బంకులు కనబడతాయి నాకు. రోజు అవసరమున్నా లేకున్న పనిగట్టుకొని మరీ చూస్తా ఈరొజుటి రేట్లెలా ఉన్నాయా అని. ఒక బంకు లో ఉన్న రేట్లు ఇంకొక బంకు లో ఉండకపోవటం ఒక విషయమైతే, ఒకే బంకులో పొద్దునొక రేటు సాయంత్రమొక రేటు ఉంటుంది. నాలుగేళ్ళ నుంచి అనుకుంటున్నా దీని వెనకున్న కధా కమామిషు కనుక్కోవాలని. ఇంతవరకూ కనుక్కోలేదు. సరే మొన్నొకసారి కాస్ట్కో లో పెట్రోలు నింపుకుంటూ యధాలాపంగా గేలను రేటెంతా అని చూసా. ఒక్కసారి నాకు కలలో నిజమో అర్ధం కాలేదు. రెండు డాలర్ల అయిదు సెంట్లు. కరెక్టుగా ఒక మూణ్ణెల్ల క్రితం నాలుగు డాలర్ల ఏడు సెంట్లు. ఈ మూణ్ణెల్లలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేవీ సంభవించలేదు. అయినా ఎందుకీ మార్పు? ఎక్కడో ఏదో ఉంది. ఎవడో ఎక్కడినించో మీటలు నొక్కు తున్నాడు. ఆ మాట కొస్తే గేలను నాలుగు డాలర్ల పైచిలుకు పలికినప్పుడు కూడా ప్రపంచం లో ఎక్కడా ఏరకమైన ఉత్పాతమూ సంభవించలేదు. అప్పుడు బారెలు క్రూడాయిలు ధర నూట ఇరవై పైనే పలికింది.ప్రస్తుతానికి యాభై పైచిలుకు. ఇప్పుడు ఇది రాసేటైముకి గేలన్ పెట్రోలు జాతీయ సగటు ధర రెండు డాలర్లు. అయ్యారే ఏమి ఈ విచిత్రము?
**************************************************************
కొత్త జబ్బులొచ్చేస్తున్నయ్.

ఈమధ్య CNN లొ ఒక వార్త చూసాను. చూసాక నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. సాక్షాత్తూ న్యూయార్క్ గవర్నరుకి సహాయకుడి గా పనిచేసే చార్ల్స్ ఓ'బర్న్ అనబడే వ్యక్తి 2001 నుండి 2005 వరకు నాలుగేళ్ళ పాటు ఆదాయపన్ను రిటర్న్స్ దఖలు పరచలేదు. బకాయి పడిన మొత్తం చాలా పెద్దది , పైగా యవ్వారం ఆదాయపు పన్ను శాఖ తోటి కాబట్టి చార్ల్స్ ఒక లాయర్ని వెతుక్కున్నాడు. ఈ లాయర్లకి అమెరికాలో బాగా గిరాకి. సరే సదరు లాయరుకి ఎంత బుర్ర గోక్కున్నా ఏ లాజిక్కూ తట్టలెదు. ఏదో ఒక సంవత్సరం అంటే ఎలాగో మానేజ్ చెయ్యొచ్చు గాని వరసగా ఐదేళ్ళ పాటంటే అల్లాటప్పా కారణాలు చూపిస్తే సరిపోదని అర్ధమయింది. చెఫ్ఫటానికైతే తన క్లయింటు డిప్రెషన్ తో బాధ పడుతున్నాడనిన్నూ, ఆ కారణం చేత రిటర్న్స్ ఫైల్ చెయ్యలేదని కోర్టు వారికి విన్నవించుకున్నా, అది నిలబడదేమో అన్న చిన్నపాటి సందేహం తో ఈసారి ఓ కొత్త కారణం తో ముందుకొచ్చాడు. అదే "Late Filing Syndrome(LFS)". తన క్లయింటు ఈ LFS అనే వ్యాధి తో బాధ పడుతున్నాడనీ,ఆ ఒక్కగానొక్క కారణం చెత రిటర్న్స్ ఫైల్ చెయ్యలేదని విన్నవించుకున్నాడు. ఈ జబ్బుకున్న లక్షణం ఏమిటంటే ఇది ఎవరినైతే పట్టుకుంటుందో వారు టాక్సు రిటర్నులు తరువాతెప్పుడైనా చేద్దాములే అని ఏళ్ళూ పూళ్ళూ వాయిదా వేస్తారట. జడ్జి గారు తూలి కింద పడబోయి, తమాయించుకొని, కాసేపు బుర్ర గోక్కుని, ఈలోకం లో ఉన్న సవాలక్ష మానసిక జబ్బుల్లో ఈజబ్బు సంగతి ఎక్కడా ప్రస్తావించ బడలేదని నిర్ధారణ చేసుకొని సదరు చార్ల్స్ గారిని దోషిగా నిర్ధారించేసారు. విషయం బట్టబయలు కావటం, ఈ ఉదంతం తరువాత గవర్నరు గారి ఆఫీసులో చార్ల్స్ పెద్ద జోకరు లాగా అయిపోయి, ఈయన కనపడగానే జనాలు చాటు మాటుగా కిసుక్కున నవ్వుకోవటం, ఇత్యాది వన్నీ చూసి గవర్నరుగారికి చిర్రెత్తుకొచ్చి ఈయన్ని ఇంటికి సాగనంపారు. కొసమెరుపేమిటంటే, కేసు మొదట్లో రిటర్న్స్ ఫైల్ చెయ్యకపోవటానికి డిప్రెషన్ కారణం అని చెప్పి ఈయన అమెరికా లో డిప్రెషన్ తో బాధపడుతున్న కొన్ని మిలియన్ల మందిని అవమాన పరిచాడని కొన్ని వర్గాలు రుసరుస లాడాయి.
******************************************************************

7 comments:

tim said...

"ఈ మూణ్ణెల్లలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేవీ సంభవించలేదు." అదేంటి అలా అనేసారు? "పెట్రో, కంపెనీలకు ప్రత్యక్ష దైవం" బుష్ & company" కొట్టు కట్టెయటం, క్రొత్త వాళ్లు కచ్చితంగా వస్తున్నరని తెలియడం, పెద్ద మార్పు కాదు అంటారా?
ఇంకొకటి, గేలన్ $4.00+ ఉంటే, కచ్చితంగా, సేనేట్, కాంగ్రెస్స్ ఎదో ఒకటి (alternate energies + subsidies to those industries, more subsidies to better cars etc.) చేస్తాయ్యని వీళ్లకు అర్ధమయ్యి వేసే వేషాలే ఇవి.
కాని మీరు అన్నట్లు, "ఈ మూణ్ణెల్లలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేవీ సంభవించలేదు." Supply and Demand పరంగా, కాని చెప్పుకోవటానికే ఇది free market economy కాని, "నేతి బీరకాయలో", "నేతి" లాంటి economy నే. గత 8 సంవస్తరాలుగా, Gas Industry, Defence Industry పండగ చేసుకొనారు బుష్ పుణ్యమా అని. ఇక ముందు చూడాలి.
మన "దేముడు" గారు ముచ్చటపడి ఏరి,కోరి, "ధనయగ్నం" కేవలం కొద్ది కంపేనీలకే ఇస్తే, బుష్ గారు ఎటువంటి bids లేకుండా ఒకే కంపేనీకి చాల కంట్రాక్ట్స్ ఇచ్చారు. Cheyne జిందాబాద్.
ఎందుకొ మన "దేవుడు" కు, రెపబ్లికన్స్ "దేవుడు" కు నాకు చాల పోలికలు కనిపిస్తాయ్యి. అలగే Cheyni కి, మన "రామ చంద్ర రఒ" కు కూడ. ఇద్దరూ silent killers ఏను.

ఉమాశంకర్ said...

@Tim గారు:

నేను చెప్పుకోదగ్గ మార్పులేవీ లేవు అన్నానంటే మార్కెట్ పరంగా అని నాఉద్దేశ్యం లో.

నా అభిప్రాయం కూడా అదే. Supply/Demand పరంగా ఏవిధమైన మార్పులూ లేవు. 4+ ఉన్నప్పుడు మన బుష్ గారు వెళ్ళి సౌదీ రాజుని బతిమాలినా వాళ్ళు Production పెంచటానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు క్రూడాయలు ధర తగ్గేసరికి Production తగ్గిద్దామని వారు అనుకుంటున్నారని వినికిడి.

ధర దాదాపు 50% తగ్గిందంటే ఎదో మతలబు ఉన్నట్టేలెక్క.

కొత్త పాళీ said...

పెట్రోలు ధర తగ్గడానికి బష్షు గద్దె దిగడం కాదు కారణం. ఆర్ధిక సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఎవడూ కొనడానికి ముందుకు రావట్లేదు. అలా డిమాండ్ పడిపోయి ధరలూ పడిపోయాయి.

Krishna said...

http://www.msnbc.msn.com/id/3036677#25252591

గాస్ pricess తగ్గటానికి, బుష్ కారణం కాకపోయినా, గాస్ కంపేనీలను, defence కంపేనీలను ముక్యంగా Cheyne HallyBurton ను నెత్తిన ఎక్కించుకొని ఊరేగింది మాత్రం నిజమే.
దాదాపు మూడు నెలలనాడు, కాంగ్రెస్స్ కొంతవరకు close చేసిన, the socalled, Enron loophole మాత్రం కచ్చితంగా కారణం అని చెప్పవచ్చు మొత్తం కాకపోయినా, చాలా వరకు.
ఈ క్రింది లింక్ చూడండి
http://www.stopoilspeculators.com/
గాస్ కంపేనీలు, Enron board of Directors లో ఒకడయిన మా వీర ముష్టి 'Phil Gram' ఈ bill పాస్ కాకుండా చాలా try చేసారనుకోండి. ఆ so called, loop hole ను పూర్తి గా మూసివెస్తే సగం పీడా పోయేది.
ఇంకో లింక్
http://closeloophole.org/2008/06/mccain-gas-prices-and-the-enro.php

internet లో ఉన్న link లు అన్నీ నమ్మమని చెప్పను గాని Phil Gram గురించి తెలిసన వాడిగా మాత్రం చెబ్తున్నాను, తను general గా oppose చేసాడు అంటే, ముక్యం గా, గాస్ కంపేనీలు తరుపున, అది మాత్రం consumers కు మంచిదేనని.

ఉమాశంకర్ said...

@కొత్తపాళీ,Krishna: Thanks for commenting.

The mere fact that the oil price changed when there is not even an iota of change in the demand/supply opens up the Pandora's box. This was my initial thought. but i was wrong...


There is an interesting article from "TIME", obsiviously i will give some credibility since it is from TIME and it is titled "Are Oil Prices Rigged?" ( http://www.time.com/time/business/article/0,8599,1834888-1,00.html).


Its interesting to know the price of oil as on today is decided by keeping in mind the next few months market predictions (demand??). its called future markets. And it is done to mimize the risk of their investments. Now i see a reason why the prices are coming down. But what made the gas to reach 4+ or even 5+ in some states? what did those socalled oil men see 3 months back? instant profits??? why should i pay for somebody's greedy predictins?

@Krishna

i read the links sent by you, i don't know how far it is true but the statement below from one of those links is disturbing...

"Some experts believe that as much as 60 percent of the cost of a gallon of gasoline, diesel fuel, or heating oil can be attributed to pure speculation and abusive –even manipulative – trading practices, yet most trading is “dark” and federal authorities can neither fully police or see the data in the majority of the trading markets"

ఉమాశంకర్ said...

i know, the regular stocks are also traded based on future demand or changes. There a choice is given to the investor whether to go for that specific stock or not. But applying the same rule on a daily need like Oil is deplorable. Here the consumer is forced to pay for sombody's predictions....

కొత్త పాళీ said...

http://en.wikipedia.org/wiki/Charles_J._O%27Byrne

interesting character

 
అనంతం - by Templates para novo blogger