ఏమిటో! ఈ మధ్య బూట్లు విసరడం ఎక్కువైంది.
కొన్ని నెలల క్రితం అమ్రీకా అధ్యక్షుడు భూషయ్య మీద, తరువాత చిదంబరం మీద, రీసెంటు గా నవీన్ జిందాల్ మీద.
అయితే సదరు వ్యక్తి తాగి ఉన్నాడనీ, అందుకే క్షమించేసాననీ జిందాల్ వారు సెలవిచ్చారు.
చదువుతూ ఓహో! అని తలూపుతుండగా ఠక్కున వచ్చిందొక ఆలోచన..
తాగితే విచక్షణా జ్ఞానం పోవాలి కదా మరి ఇదేమిటి? ఈయనలో మేల్కొన్నట్టుందే!
ఏంటో?
ఇంత చిన్న విషయమే బోధపడకపోతే, ఇక ఆ పరమ సత్యం నాకెన్నటికి బోధపడేను?
***************************************************************************
ఇంకొకటి.
ఒకానొక శుక్రవారం నాడు.
సమయం సాయంత్రం ఆరు గంటలు. పనుండి ఆఫీసులోనే ఉండిపోయా.
దాదాపు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి అంతా నిశ్శబ్దంగా ఉంది.
నేను కూడా వెళ్ళిపోయాననుకున్నారేమో, నా సహోద్యోగులు, ముగ్గురు తెల్లోళ్ళు మాట్లాడుకుంటున్నారు.
వద్దనుకున్నా చెవిలో వచ్చి పడుతున్నాయి మాటలు.
"సుబ్బారావేడీ? ఈ మధ్య కనపడటం లేదే"
"ఆయన పెళ్ళి. ఇండియా వెళ్ళాడు, వచ్చే సోమవారం వస్తాడు"
మేగన్ అడిగింది.
"అవునూ మీకు తెలుసా, ఇండియాలో పెళ్ళి అయ్యేవరకూ ఆడైనా మగైనా వర్జినిటీ పోగొట్టుకోరట"
"ఏమిటీ! నిజమే?" రెండు మగ గొంతులు ఆశ్చర్యంగా.. నోరెళ్ళబెట్టి..
"ఒకవేళ అమ్మాయి పోగొట్టుకుందని తెలిస్తే వీధుల్లోకి లాక్కొచ్చి రాళ్ళతో కొట్టి చంపుతారట".
ఇంతలో ఎవరో "ష్" అంటూ నేను ఇంకా అక్కడే ఉన్నానని వారికి సైగచేసి చెప్పటం తెలుస్తూనే ఉంది.
కాసేపు నిశ్శబ్దం..
ఆ తరువాత చిన్న చిన్న గుసగుసలు.
కాసేపటికి పూర్తి నిశ్శబ్దం.
కాలం తో కాసేపు పరిగెడతాం.తెలీకుండానే ఎక్కడో ఒకచోటఆగిపోతాం.అక్కణ్ణించి కాలంతో పాటు ఉన్నామనే భ్రమ లో హాయిగా బతికేస్తాం.కనీసం ఎక్కడున్నామో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యం.తీర్పులు మాత్రం ఇచ్చేస్తుంటాం. జ్ఞానాన్ని అడక్కుండానే అందరికీ పంచేస్తుంటాం.
Showing posts with label నా ఆలోచనలు. Show all posts
Showing posts with label నా ఆలోచనలు. Show all posts
Thursday, April 16, 2009
Subscribe to:
Comments (Atom)
ఒక సినిమా-కొన్ని జ్ఞాపకాలూ
న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో. (తెలియని వారికి: అమెరికాలో...
-
" ఏమిటి , వెళ్ళక తప్పదా ?" " నీ ఇష్టం " మూడక్షరాల సమాధానమైనా , ముప్పై మూడు విరుపులు వినపడ్డాయి నాకు . అలవాటు ప...
-
న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో. (తెలియని వారికి: అమెరికాలో...
-
నచ్చకో మరెందుకో పబ్లిష్ చేయకుండా వదిలేసిన పాత పోస్టులు చూస్తుంటే ఇదిగో ఇది కనపడింది. తారీఖు చూస్తే జులై 31, 2010. అప్పటికింకా పిల్లలు ప...