"ఏమైనా మాట్లాడొచ్చుగా?"
ఈ పదేళ్ళలో లెక్కలేనన్ని సార్లు వినుంటానీ మాట. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తరచుగా.
ఏం మాట్లాడాలి? ఈ ప్రశ్న నెదుర్కొన్న ప్రతిసారీ కాకపోయినా కొన్ని కొన్ని సార్లు ఈ అభియోగాన్ని తిప్పి కొట్టడానికి చేసే ప్రయత్నంలో ఏదో మాట్లాడుతాను.ఆ మాటలు చాలా వరకు అప్పటి మా ఇద్దరి మనస్థితికీ , నేను (తెచ్చి పెట్టుకొని) మాట్లాడే మాటలకీ పొంతన కుదరక తేలిపోతాయి.ఇంట్లో అయితే తను మళ్ళా ఏ టీవీనో లేక వంటగదినో ఆశ్రయిస్తుంది. ఎప్పటిలా నేను తిరిగి నా లోకంలోకి.

ఈ ప్రశ్న నాకు గుర్తుండి మొట్టమొదటిసారి నాన్న నుంచి విన్నాను నా ఇంటర్లో." ఏంట్రా ఎప్పుడూ అలా ఏదో ఆలోచిస్తూ ఉంటావ్, ఏం ఆలోచిస్తున్నావ్?" అంటూ. ప్రతి పదం గుర్తే ఇప్పటికీ.అప్పటినుంచి కూసింత ఆసక్తితో నన్ను నేను గమనించుకోవటం మొదలు పెట్టినట్టు గుర్తు. అది మొదటి దశ .
ఇంటర్ అయిపొయింది.అలానే ఇంజనీరింగు రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరం మొదలయిన మొదట్లో నేను మళ్ళా ఈ "మాటల" విషయంలో నాలోని మార్పుని ప్రస్పుటంగా గమనించాను.మొదటి రెండేళ్ళూ హాస్టలు రూముల్లో అర్ధరాత్రీ ఆపరాత్రీ లేకుండా పిచ్చాపాటీలు మాట్లాడినా,మూడో సంవత్సరం నుంచి నాలో ఏదో మార్పు. అప్పుడు మాత్రం దాదాపు అందరికీ ఉండే ఏవో కొద్దిపాటి సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుసు. సిటీ బస్సెక్కినా కనీసం నాపక్కన ఎవరు కూర్చున్నారో కూడా గమనించనంతగా ఆలోచనల్లో కూరుకుపోయేవాడిని. అడపాదడపా నేను దిగాల్సిన స్టాపు మిస్సయిన సందర్భాలూ గుర్తే. ఆ ఆలోచనలకి ఊతమియ్యడానికి యూనివర్సిటీ కేంపస్లో గంటలకొద్దీ అలా నడుస్తూ ఉండేవాడిని. అది రెండో దశ .
జీవితంలో కాస్త నిలదొక్కుకొని జీవితం పట్ల నాకంటూ ఏవో కొన్ని స్థిర అభిప్రాయాలు ఏర్పరుచుకున్నాక మౌనాన్ని ఆశ్రయించటం మూడో దశ. ఆఫీసులో,అడపాదడపా పార్టీల్లో,దైనందిన చర్యల్లో ఎదుటివారు మాట్లాడే మాటల్లో ముప్పాతిక వంతు నా ఆసక్తికి సరిపడనివైన కారణంగా తెచ్చిపెట్టుకున్న మౌనం.
"ఎందుకలా కామ్ గా ఉంటావ్?" అన్న వాళ్ళతో "నాతోనేను ఎన్ని మాటలు మాట్లాడుకుంటానో మీకేం తెలుసు?" అని అనాలనిపిస్తుందోసారి.అదయినా ఎందుకు మాట్లాడడం అని నా గొంతు నోక్కేసుకుంటా.మాట్లాడడం వాళ్ళకిష్టం. మాట్లాడక పోవడం నాకిష్టం. రెండూ ఒకటే. వాళ్ళు చనువుగా నన్ను నిలదీస్తారు. నేను తిరిగి సమాధానం చెప్పను. ఎందుకంటే నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు కనక :)
పిల్లల విషయంలో మాత్రం ఒట్టు గట్టు మీదే .