అహంకారంతో విర్రవీగి సౌదీ ప్రస్తుతానికైతే బొక్కబోర్లా పడింది.
డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అనే సూత్రం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా దేశాల స్థాయిలో కూడా భేషుగ్గా పనిస్తుంది కాబట్టి ఇంకొన్ని వారాలకి బహుశా ఇది మరుగున పడి పోవచ్చు. కానీ జరిగిందేమిటో పరిశీలిస్తే మనసు కకావికలం కాక తప్పదు.
సౌదీ రాజకుటుంబానికి ఒకప్పుడు దగ్గరగా మెలిగి ప్రస్తుతం వారి తీరు నచ్చక దూరం జరగటమే కాకుండా అంతర్జాతీయ మీడియాలో వారికీ,వారి మొక్కుబడి పాలనా సంస్కరణలకు వ్యతిరేకంగా గళమెత్తిన సౌదీ దేశపు జర్నలిస్టు జమాల్ ఖషోజీ. ( ఆయన జర్నలిస్టు కావడానికి ముందు ఏంచేసాడన్న దానిమీద భిన్నాభిప్రాయాలున్నాయి).
ఆయన ఈ అక్టోబర్ రెండున టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయం లోకి విడాకుల ధృవీకరణ పత్రం కోసం వెళ్లి ఇక తిరిగి రాలేదు. కీడు ముందే శంకించిన ఆయన తన కాబోయే భార్యకు ముందే చెప్పాడట తాను ఒక గంటలోపు బయటికి రాకపోతే తనకు తెలిసిన టర్కీ అధికారికి ఫోన్ చేసి 'అలర్ట్' చేయమని. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఒక హాలీవుడ్ స్పై సస్పెన్సు థ్రిల్లర్ ని తలపించాయి.
సౌదీ మొదట్లో జమాల్ వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోయాడు మాకేం తెలియదని బుకాయించింది. 'సాక్ష్యాలేవీ?' అని టర్కీ అడిగితే 'సి సి కెమెరాలు ఆ రోజు పనిచేయలేద'ని చెప్పింది. అయితే సరే గానీ 'మా దగ్గర అసలేం జరిగిందో సవివరంగా తెలిపే ఆధారా లున్నాయి' అని టర్కీ మొదటి బాంబు పేల్చే సరికి సౌదీ కాస్త దిగొఛ్చి 'రాయబార కార్యాలయంలో జరిగిన గలాటా ('ఫిస్ట్ ఫైట్ ') లో జమాల్ చనిపోయాడని' విచారం వెలిబుచ్చింది. 'మాదగ్గరున్న (ఆడియో )ఆధారాలు బయటపెట్టమంటారా' అని టర్కీ అనేసరికి సౌదీకి తప్పు ఒప్పుకోక తప్పలేదు. ఇంతా చేసి టర్కీ ఆ ఆడియోని మీడియాకి విడుదల చేయలేదు ఎందుకంటే విదేశీ రాయబార కార్యాలయంలో నిఘా పరికరాలు అమర్చడం అంతర్జాతీయ నియమావళికి విరుద్ధం కాబట్టి.
ఈ మొత్తం విషయంలో టర్కీ మీడియాని 'మేనేజ్' చేసిన చేసిన విధానం అమోఘం. రోజుకో లీక్ , అదికూడా పశ్చిమ దేశాల మీడియాకి ( ముఖ్యంగా అమెరికా). ఎక్కడ మీట నొక్కితే దాని ప్రభావం ఎక్కువుంటోందో టర్కీ కి బాగా తెలుసు.పైగా జమాల్ అమెరికా వాస్తవ్యుడు ( గ్రీన్ కార్డు) కావడం, వాషింగ్టన్ పోస్ట్ తరపు జర్నలిస్ట్ కావడం మూలాన అమెరికా మీడియాలో ఈ వార్తకు తగిన ప్రచారం లభించింది.
మీడియా మానేజ్మెంట్ విషయంలోనే కాదు, కేసు దర్యాప్తుపరంగా కూడా టర్కీ పశ్చిమ దేశాలకు తీసిపోని విధంగా శరవేగంగా అన్ని ఆధారాలనీ బయటకు లాగింది. ఈ నేరానికి పాల్పడ్డ పదిహేనుమంది పేర్లూ, వారి వివరాలూ, ఎవరెప్పుడు ,ఎలా టర్కీ దేశంలోకి ప్రవేశించిందీ,బస చేసిన హోటళ్ళూ, తిరిగి ఎలా సౌదీ వెళ్లిపోయారనేది మొత్తం కూలంకషంగా బయటపెట్టి సౌదీని మొదటినుంచి రక్షణాత్మక ధోరణిలోకి నెట్టేసింది. చాలా పైస్థాయిలో ఈ హత్య కి సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయంటూ నర్మగర్భంగా వేలు సౌదీ యువరాజు వైపు చూపెట్టింది.
హత్య జరిగిన తీరు మాత్రం భయానకంగా ఉంది. సౌదీ లో రాజవంశానికి దగ్గరివాడైన, ఆటాప్సి చేయడంలో నిపుణు డైన ఒక డాక్టరు హెడ్ ఫోన్స్ లో సంగీతం వింటూ తాపీగా జమాల్ బతికుండగానే దేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడట. ఏ ఐఎస్ఐ,తాలిబాన్ టెర్రరిస్టులే కాదు బాధ్యతగల దేశాలు కూడా 'డిప్లొమాటిక్ ఇమ్మ్యూనిటి' ముసుగులో ఇలాంటి ఘోరమైనచర్యలకు పాల్పడడం దారుణం.హంతకులు జమాల్ చేతి వేళ్ళను హత్యకు ఆదేశించిన వారికి ఒక 'ట్రొఫీ' లా సౌదీ తీసుకెళ్లారని ఒక కథనం.
ఈ విషాద ఘటన పై అంతర్జాతీయస్థాయిలో మీడియా సర్కిళ్లలో వెల్లడైన విపరీతమైన అసంతృప్తీ , ఆవేదనా, ఆంక్షలు విధించాల్సిందే అని పట్టుబట్టిన వివిధ దేశాధినేతలూ,నిజం వెల్లడయ్యే వరకు సౌదీలో పెట్టుబడుల విషయంలో తమ నిర్ణయాలు వాయిదావేసిన మల్టీ నేషనల్ కంపెనీలూ ఇవన్నీ ప్రాణాలకి తెగించి నిజాన్ని నిర్భయంగా వ్యక్తపరచగలిగే 'తెగింపు' ఉన్న జర్నలిస్టులకు నిరాశ పడకుండా, భవిష్యత్తుపై ఆశ కోల్పోకుండా ఎంతోకొంత ఆసరా ఇచ్చేవే.
మన భారత మీడియా ఈ వార్తకు ఏ మేరకు ప్రాధాన్యత ఇచ్చిందో నాకు తెలీదు.