విరామానంతరం

Tuesday, May 11, 2010

వారం క్రితం "హమ్మయ్య , సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక రాయడం మొదలెట్టొచ్చు" అనుకున్నా. వారం గడిచినా అక్షరం ముక్క కూడా రాయలేదు. కొత్త ఊరు.కొత్త ఆఫీసు. పని ఎక్కువ.కానీ ఇవన్నీ కారణాలు కావు. అసలు తప్పంతా రోజుకి మూడు గంటల పైనే తినేస్తున్న ఆఫీసు ప్రయాణానిదే. ఒక నాలుగు మైళ్ళ కారు ప్రయాణం, అక్కడి నుంచి ఒక ఇరవై ఐదు నిమిషాల బస్సు ప్రయాణం. అక్కడినుంచి మళ్ళా ఇంకొక ఇరవై నిమిషాల రైలు ప్రయాణం. పోస్టేజి ఖర్చులు అదనం అన్నట్టు, బస్స్టాండు లోనూ, రైల్వే స్టేషనులోనూ వెయిటింగు టైము అదనం.ఇలా తెల్లవారు ఝామునే ఆరింటికి నిద్ర లెగవాలంటే నాబోటి వారికి చాలా కష్టం. పొట్ట కోసం తప్పదు కదా.ఇప్పుడు ఆవలింతలతో ఆఫీసుకి రావడం, కునికిపాట్లు పడుతూ పని చేయడం, మళ్ళా కాళ్ళీడ్చుకుంటూ రైలు,బస్సు కారు ప్రయాణం. అలా సప్త సముద్రాలు దాటి, ఆవలించుకుంటూ ఇంట్లోకి ప్రవేశం. ఏదో ఇంత తినటం, టీవీలో మా ఊరి వార్తలు చూస్తూ అలానే నిద్ర పోవటం.ఇలా రోజంతా ఆవలింతలతోనే సరిపోతోంది.

ఏదేమైనా "రాయకుండా ఇంకానా? ఇకమీదట సాగదు" అని ఈరోజే ఘాట్టిగా నిర్ణయించుకున్నాను. "ఇంత కష్టపడి రాయాలా? నీ పిచ్చిగానీ" అని నాకనిపించినా, ఎవరి పిచ్చి వారికానందం కదా అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను :) అదన్నమాట సంగతి.

మొన్నీ మధ్య ఒక బ్లాగులో చదివా. వ్యాఖ్యలు రాసినా వాటికి బ్లాగు రచయితలు సమాధానమీయకపోవటం మర్యాదకరం కాదు అని. నేను తెలిసీ చేసే తప్పుల్లో ఇదొకటి.అలా నేను చాలాసార్లు చేశా.ఇక మీదట అలా ఉండకూడదు అనుకుంటున్నా. వ్యాఖ్యలంటూ వస్తే, దానికి సమాధానమంటూ ఉంటుంది. తిరిగి రాయడానికేమీ లేకపోతే కనీసం "ధన్యవాదాలు" అనన్నా... :) .

ప్రస్తుతానికి అదండీ సంగతి.

16 comments:

శరత్ 'కాలమ్' said...

నాకు కూడా మొదట్లో కామెంట్లకి స్పందించాలని తెలిసేది కాదు. ఇప్పుడు చాలావరకు వ్యాఖ్యలకు స్పందిస్తున్నాను.

KumarN said...

So you are into new jersey and commuting to city or long island or something???

Its impossible to get anytime during weekdays.

I hear you my friend.

జయ said...

కంగ్రాట్సండి. మురళి గారు చేసిన మీ బ్లాగ్ పరిచయం తో మీ పోస్టులన్నీ చదివాను. మీ కొత్త పోస్ట్ కోసం ఎదురుచూస్తున్న వారిలో నేను కూడా ఉన్నాను.

చిన్ని said...

అనంతానికి స్వాగతం ......ఎన్ని రైళ్ళు ఎక్కిన విమానాలెక్కి సప్త సముద్రాలు దాటినా ఒక అరగంట వెసులుబాటు చేసుకుని వారం కి ఒక్కసారయిన దర్శనం ఇవ్వాలని మా కోరిక

బ్లాగాగ్ని said...

Welcome back Uma Shankar garu. We missed your blog a lot.

శేఖర్ పెద్దగోపు said...

ఉమాశంకర్ గారూ...వచ్చేసారా...మొన్నటి వరకూ నా బ్లాగ్ రోల్ లో మీ అప్ డేట్స్ ఏమీలేకపోవటం చూసి అనుకునేవాడిని....చక్కగా రాసే బ్లాగర్లు ఇలా అర్ధాంతరంగా ఎందుకు మానేస్తారో అని...ఇదన్నమాట విషయం..పోనీలెండి..ఇప్పటికైనా కుదిరింది....టట్టడాం అని టపాలతో రెడీ అయిపోండిక..:-)

స్రవంతి said...

మీ బ్లాగుని మిస్ అయిన వాళ్ళలో నేను కూడా ఉన్నానండి.

మురళి said...

Welcome back!!!

సిరిసిరిమువ్వ said...

Welcome back.

కొత్త పాళీ said...

Welcome Back.
నేను సైతం మిస్సయ్యాను మీ రాతల్ని :)
పోనీ ఓపని చెయ్యండి - శరత్ గారి ఆఫీసులో ఏమన్నా ఖాళీలున్నాయేమో కనుక్కోండి, ఇంచక్కా ఆఫీసులో కూర్చుని రోజుకో టపా రాసుకోవచ్చు!

శరత్ 'కాలమ్' said...

@ కొత్తపాళీ
హమ్మా. దేశీలను మా ఆఫీసులోకి రానిస్తానుటండీ. ఒక్క దేశీ కూడా మా కంపెనీలో లేక మనస్సుకి హాయిగా వుంది. మరీ ఇంత ప్రశాంతతా అని నాలో నేను ఉడుక్కొని అప్రశాంతత కోసమనే బ్లాగుల్లో కెలుకుతూవుంటాను.

భాస్కర్ రామరాజు said...

ఎల్కం బ్యాక్.
జెర్సీ సుట్టుపక్కల ఇలాన్టి కట్టాలు మామూలే అన్టున్టారు. మీ కత సదివినాక నిజఁవే అనిపిస్తోంది.

ఉమాశంకర్ said...

@శరత్'కాలమ్: మీకు తెలియకేమో, నేను మాత్రం తెలిసే నిర్లక్ష్యం చేసాను చాలా సార్లు.ఏవేవో పనులు.టపా పోస్టు చేసేనాడు ఉన్న ఉత్సాహం తరువాత తగ్గిపోవడమూ. గట్రా...
@KumarN
ఈ ప్రాజెక్టు పుణ్యమాని ఇంతవరకు జిమ్ముకెళ్ళే తీరిక కూడా దొరకలేదు. టెన్నిస్ సంగతి సరేసరి.ఏంచేస్తాం చెప్పండి? :(
@జయ,చిన్ని,బ్లాగాగ్ని,శేఖర్ పెద్దగోపు , స్రవంతి,మురళి,సిరిసిరిమువ్వ ,భాస్కర్ రామరాజు : ధన్యవాదాలండీ..మీ వ్యాఖ్యలు చూసాక మునుపటి ఉత్సాహం గుర్తుకొస్తోంది..
@కొత్తపాళీ: No Desis please అటండీ.ఇంకేంచేస్తాం? :(

GIREESH K. said...

Welcome back! I missed your writings....Nice to see you back,.

ఉమాశంకర్ said...

@GIREESH.K

Thank you.I will try to be more often.

RAGHAVENDRA RAO DA said...

నాకు చరిత్ర అంటే ఇష్టం . నేను "అశోక్ సామ్రాట్ " నావెల్
రాసాను.చదవి మీ అభిప్రాయం చాపుతార ?.hallihyda.blogspot.com

 
అనంతం - by Templates para novo blogger