అ'రాచకీయాలు

Tuesday, April 28, 2009

పోలికలు తేకూడదు అని ఎంత అనుకున్నా కొన్ని విషయాల్లో నిభాయించుకోలేను. అలాంటివార్తొకటి ఈరోజు చదివాను. ఆ వార్త ఇదిగోండి . అమెరికాలో గత తొంభయ్యారేళ్ళలో పార్టీ ఫిరాయించిన వారు 13 మంది.

సొంత పార్టీ తీర్మానానికి వ్యతిరేకంగా చట్టసభల్లో ఓటేయడం వేరేవిషయం. దాన్ని వదిలేస్తే, రిపబ్లికన్ నుంచి డెమొక్రటిక్ పార్టీకి లేదా ఇటు నుంచి అటుకి మారినవారు మొత్తం 13 మంది.

దాదాపు వందేళ్ళలో....

13 మంది. అక్షరాలా పదమూడు మందే. మీరు సరిగ్గానే చదివారు.

మనది "లార్జెస్టు" డెమోక్రసీ కదా, మనకి ఇంతకంటే ఎక్కువ ఉండడం సహజం. కాబట్టి ఆ 13 పక్కన ఒక రెండుసున్నాలో మూడూ సున్నాలో పెట్టుకొండేం?

విద్యా చరణ్ శుక్లా గుర్తుకొచ్చాడు ఒక్కక్షణం. చెయ్యని మినిస్ట్రీ లేదు, చేరని పార్టీ లేదు.

*********************************************************************************

ఇవేమి దీక్షలో...

ఇదొక పక్కరాష్ట్రం పెద్దమనిషి కథ.

ముక్కుపచ్చలారని చిన్నపిల్లల్ని కూడా మెళ్ళో సైనైడ్ గొట్టం వేసి ఆహ్వానం పలికే ఓ ఉగ్రవాద సంస్థ మీదకి ఈయనకి అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది.

ఇంకేముందీ, దీక్షకి రంగం సిద్ధం.

పట్టెమంచం, మెత్తటి పరుపూ, చల్లగా సేద దీరడానికి ఏసీలూ, ఫేన్లూ. మరి దీక్షా మజాకానా? ఆత్మవంచనకి ఆత్మగౌరవం ముసుగేసి ఓట్లడుక్కోడానికి ఆమాత్రం సెటప్పు కావద్దూ?

ఈ సందట్లో ఎవరిమూలాన వైధవ్యం ప్రాప్తించిందో వారినే రక్షించాల్సిన దుస్థితి పాపం ఇంకొకామెది.

రాజకీయం కదా, ఇక్కడ లాజిక్కులుండవు మరి.

13 comments:

తెలుగు ప్రపంచం said...

The rebels In srilanka are product of injustice rendered by sinhala chavunism. As a humanbeings me must emphtical towards them

Varunudu said...

ayyaa, tama blog loni, colours, font colors - chaalaa daarunam gaa unnaayi. Dayachesi, maariste chadavadaaniki veelugaa untundi.

చిలమకూరు విజయమోహన్ said...

ఏమి చేస్తాం అంతా మన ఖర్మ అని సరిపెట్టుకోవలసిందే

సుజాత said...

బాగా చెప్పారండీ! ప్రభాకరన్ అల్లంతదూరంలో కనిపిస్తున్నాడనగా ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. రావణ కాష్టం చల్లారిపోతే మరి రేపటునుంచి ఎలా? జనం దృష్టిని ఆకర్షించడానికి ఏవో తిప్పలు పాపం! అది సరే గానీ మరీ అన్ని కూలర్లా?

చిన్ని said...

హు !మన అరవయ్యేళ్ళ ప్రజాస్వామ్యంలోని రాజకీయ పార్టీ ల గురించి చెప్పుకోవాలంటే ......మన సమయం వృధా అనుకుంటాను..నిజంగా ఆశ్చర్యం కేవలం పదమూడంటే

మురళి said...

మన రాజకీయాల గురించి వీలైనంత తక్కువగా ఆలోచించడం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిది.. ఇక దీక్షలంటారా? ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళవి...జనం నమ్ముతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు.. వాళ్ళు ఫ్రీగా వినోదం పంచుతున్నారని జనం అనుకుంటున్నారు.. అన్నట్టు నాకు మాత్రం మీ బ్లాగు డిజైన్ చాలా నచ్చిందండి..

చిన్ని said...

@తెలుగుప్రపంచం
అలా అని మనమే ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్నాము అనుకోవాలి ....మైనారిటిగా మనవాళ్ళు అనా? ......అర్ధం కాలేదు .

ఉమాశంకర్ said...

@తెలుగు ప్రపంచం
Do you mean empathy?

Anyhow, the decades long oppression of those minorities is world known, should be condemned and better be resolved in a peaceful way.A self sustaining state cannot be formed at gun point.

But this post is not about that problem but about those who take political mileage out of every such crisis.

@ Varunudu గారు,
ఇప్పటివరకు ఎవ్వరు అలా అనలేదండీ.మీ సిస్టంలో సెట్టింగ్స్ ఒకసారి చూసుకోండి. :)

@చిలమకూరు విజయమోహన్ గారు,
:)
@ సుజాత గారు,
కరెక్టుగా చెప్పారు. ఆయనగారి ఫోటో పేపర్లో చూడగానే చిరాకేసిందండీ.
@ చిన్ని గారు,
నేనుకూడా ఆశ్చర్యపోయాను. వీళ్ళకి బొత్తిగా రాజకీయాలు తెలిసినట్ట్లేదు.
@ మురళి గారు,

అవునండీ, బీపీ కంట్రోల్ లొ ఉండాలంటే ఇలాంటివాటిని చిర్నవ్వుతో చదివి పక్కనపెట్టేయడం బెటర్.

నా బ్లాగు said...

ఏమి రాజకీయాలోనండి. చదువుకున్న వాళ్ళెవ్వరూ ఓటెయ్యరు. వోట్ల కోసం వాళ్ళు ఎంత రాజకీయమైనా చేస్తారు. వార్త పాతబడ్డాక అంతా మామూలే. ఈమధ్యలో ఇంకొంచం గాఢత పెంచటానికి వీలుంటే అదీనూ. శుక్లా దాకా ఎందుకు మన పచ్చ మరియు ఆకు పచ్చ చొక్కాలు ఎన్ని సార్లు గోడలు దూకలేదు.ప్చ్....

ఉమాశంకర్ said...

@నా బ్లాగు
ముందు ముందు పరిస్థితి మారుతుంది లెండి.. జనం విసుగెత్తి ఉన్నారు..అప్పటికంటే ఇప్పుడు యువతలో చైతన్యం ఎక్కువగా ఉందనిపిస్తోంది..

అప్పట్లో ప్రభుత్వాలు మారినప్పుడు మంత్రివర్గాన్ని ప్రకటించగానే ఆసక్తిగా ఎవరికే మినిస్ట్రీ వచ్చిందా అని చూసేవాడిని.. అలా శుక్లా గారిపేరు రిజిస్టర్ అయింది నా బుర్రలో.

భాస్కర్ రామరాజు said...

అన్న గారూ అంతా మంచేనా?

ఇలాంటి పోరాటాలు మొదలుపెట్టినప్పుడు నిర్దిష్టమైన అజెండాతోనే మొదలౌతాయ్. తర్వాత్తర్వాత పోరాటాన్ని నడిపేవాడి స్వార్ధ రాజకీయాలతో హైజాక్ చేయబడతాయ్. ఐతే, ఒకడి స్వార్ధంకోసం, లేక ఒక పార్టీ స్వార్ధంకోసం సామాన్య బడుగు పేద ప్రాణాలు బలవంతంగా తీసేయ్యటం సమూహం/సమాజం దురదృష్టం. అది ఎల్.టి.టి.ఈ కావచ్చు, లేక నక్సలిజం కావచ్చూ లేక ఇంకేమైనా కావచ్చు.
చిన్నచిన్న పిల్లల్ని బలవంతంగా లాక్కెళ్ళి వాళ్ళ చేతుల్లోని పెన్ను పుస్తకాన్ని లాగేసి ఏకేలు ఇచ్చి వాళ్ళని బలి ఇవ్వటం అమానుషం.

ఉమాశంకర్ said...

భాస్కర్ గారు,

బావున్నానండీ. ఈ రెండురోజులు బాగా చల్లగా ఉంది. మీరు మీఊళ్ళో పెట్టిన పప్పు కుంపటి సెగ మా ఊరి దాకా వస్తేనూ, చక్కగా సెగ్గ్కాచుకుంటూ (సెగ కాచుకుంటూ) ఇలా బ్లాగేస్తున్నా... :)

బాగా చెప్పారు.

GIREESH K. said...

సుజత గారూ..
కూలర్లే కాదండీ...భర్యలు కూడా... తలదగ్గర ఒకరు, కాళ్ళదగ్గర ఒకరు..మహాభారతం సీను గుర్తుకొచ్చింది :)

 
అనంతం - by Templates para novo blogger