చెణుకులు

Monday, April 20, 2009

ఈయన అప్పుడెప్పుడో "అసలు రాముడున్నాడా?" అనీ , "రాముడు తాగుబోతు" అనీ, అనేసి కొట్టుకుచావండ్రా అని చేతులు దులిపేసుకున్నారు. అప్పటి బాధపడ్డ హృదయాలకు ఇప్పుడిదిగో సమాధానం.


ప్రభాకరన్ ఉగ్రవాది కాడు.


ఇన్నాల్టికి ఆయన మనః స్థితి మీద ఒక అంచనా లాంటిది దొరికినట్టయి మనసు ప్రశాంతంగా ఉంది నాకు. ఇప్పుడీయన రాముణ్ణెన్నన్నా నాకేమాత్రం బాధ లేదు. నిజానికి ఎప్పుడంటాడా అని ఎదురుచూస్తున్నా. అన్నాక కాసేపు నవ్వుకోవచ్చుగా.


*********************************************************************************************

ఒకప్పుడది జెంటిల్మన్లాడే ఆట.


రోజుకి ఎనిమిది గంటల చొప్పున ఐదురోజులపాటు దాదాపు నలభై గంటలపాటు ఆడే ఆట. స్వఛ్చతకీ , హుందాతనానికీ ప్రతీకగా తెల్లని దుస్తులు.


ఒక రెండు దశాబ్దాల క్రితం ఆ ఆట నలభై గంటలనుంచి ఎనిమిది గంటలకి కుదించంబడింది. తెల్లని దుస్తులు కాస్త మసకబారాయి. అయితే అప్పుడప్పుడు వాటిని కాస్త ఉతుక్కున్నారు కాబట్టి ఆ మసకదనం అంతగా కనబడలేదు.


ఈ మధ్యే అది ఆ ఎనిమిదిగంటలనుండి రెండుగంటలకీ, కొన్నిసార్లు గంటన్నరకీ కుదించబడింది.


ఇప్పుడు ఆ ఆట చూడ్డానికొచ్చిన అమ్మాయిలకి వేల డాలర్ల నజరానా, బాలీవుడ్ కథానాయికగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే అవకాశం.మార్పుకి సాక్షీభూతమవటం చాలావరకు దుఖః కారణం. . అప్పుడప్పుడూ మాత్రమే గర్వకారణం. నేను చివరిసారిగా గర్వపడిందెప్పుడా అంటే అస్సలు గుర్తుకు రావటంలేదు. ఈ క్రమంలో సినిమాలూ, రాజకీయాలూ,విద్యా, వైద్యం అవన్నీ గుర్తుకొచ్చి ఇంకాస్త ఏడుపొచ్చింది.


ఎప్పుడో వదిలేసుకున్న చెస్ ఆట మీద మక్కువ మళ్ళీ మొదలవుతోంది నాలో.దేముడా! దానికేమాత్రం ప్రాముఖ్యం వద్దు. దాన్నక్కడే ఉండనివ్వు.6 comments:

చదువరి said...

ఇప్పుడాయన మళ్ళీ మాట మార్చాడంట. :)
-----------------
ఇప్పుడు జరుగుతున్న క్రికెట్ తిరనాళ్ళ గురించి ఇంకో కొత్త సంగతి తెలిసిందివ్వాళ - చూట్టానికి వచ్చిన ప్రేక్షకుల్లోంచి సుందరాంగులను ఎంపిక చేస్తారంట. గెల్చినోళ్ళకి హిందీ సినిమాల్లో అవకాశం! క్రికెట్టు సంగతెట్టాగన్నా ఉండనీండి.. మిగతావి మాత్రం వెలిగిపోతున్నాయి.

ఉమాశంకర్ said...

@ చదువరి

మీకు తెలీదూ? మీడియా వక్రీకరణండీ బాబూ, మీడియా వక్రీకరణ.

మురళి said...

కేవలం న్యూస్ పేపర్లు మాత్రమే ఉన్న రోజుల్లో 'మీడియా వక్రీకరణ' అన్న మాటకి కొంచమైనా అర్ధం ఉండేది. ఇప్పుడు నాయకుడు మాట్లాడిన ప్రతి మాటను యాభై కి తక్కువ కాకుండా కెమెరాలు చిత్రీకరిస్తూ, కనీసం అందులో సగమైనా లైవ్ ప్రసారం చేస్తున్న కాలం లో కూడా 'మీడియా వక్రీకరణ' అని కేవలం మన నాయకులు మాత్రమే అనగలరేమో.. ఇక క్రికెట్ గురించిన తాజా వార్త..nothing but height of commercialisation.. అంతే..

ఉమాశంకర్ said...

@మురళి,
బాగా చెప్పారు. నాకెప్పుడూ అనిపిస్తూంటుంది, వీడియోలో పడ్డాక కూడా మాట ఎలా మారుస్తారో అని.

నాకైతే నండీ ఈ IPL లో బంతిని కొట్టి డబ్బుకోసం పరిగెడుతున్నట్టే ఉందిగానీ క్రికెట్ ఆడుతున్నట్టులేదు.

చిన్ని said...

మొన్నటి టపా మాదిరి ఇప్పుడు కూడా కామెంట్ కి అవకాశం ఇవ్వలేదేమో అనుకుంటూ చదివాను ......

ఉమాశంకర్ said...

లేదండీ. అలా చేయటం తప్పనిపించి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను :)

 
అనంతం - by Templates para novo blogger