నా తెలుగు సినీదర్శకులు

Tuesday, December 9, 2008

సరదాగా రాసుకున్న టపా ఇది.


నేను ఎవరైనా సినీ దర్శకుడిని గుర్తుచేసుకుంటే అసంకల్పితంగా, ఒక సినీ ప్రేక్షకుడిగా, చటుక్కున నాకు స్ఫురణకి వచ్చే అంశాన్ని ఆయా దర్శకుల పేర్లతో జోడించి రాసాను. మీకు నే రాసినది గాక ఇంకేమైనా గుర్తుకొస్తే మీ చూపలాంటిది అనుకొని సరిపెట్టుకోండేం?

బి. విఠలాచార్య: మాయలూ, మంత్రాలూ , రాకుమారుడూ-రాకుమారి

కె. విశ్వనాధ్ : మొహంలో అవసరమైన దానికన్నా ఎక్కువ సాత్వికత

మణిరత్నం: అందమైన కేమెరా

రాం గోపాల్ వర్మ : జులపాల జుట్టు రౌడీలు, హింస తో కూడుకున్న చీకటి

జంధ్యాల : మధ్యతరగతి ఇళ్ళు, అందమైన తిట్లు, వైజాగ్

రేలంగి నరసిఁహారావ్: సాదా సీదా మధ్యతరగతి మనుషులు

బాల చందర్: విప్లవ ధోరణిలొ సాగే ప్రేమకధలు

ఈ.వి.వి సత్యనారాయణ: అందాల ఆరబోత తో కూడిన హాస్యం

చంద్రశేఖర్ యేలేటి: వైవిధ్యం, వైవిధ్యం, వైవిధ్యం... వెరసి ఉలిపికట్టె

వంశీ: యాసతో కూడిన హాస్యం, మూడు నిముషాల పాటకి మూడొందల ఫ్రేములు

శంకర్: అవినీతి, ఒక మెలోడీ,ఒక ఫాస్ట్ బీట్ , ఒక జానపద పాట, హింస

కృష్ణవంశీ: రంగు రంగుల ముగ్గులు, అవసరమైన దానికన్న ఎక్కువ నోరు చేసుకొనే హీరోయిన్లు, తడిసిన తలలతో హీరోలు

వి. వినాయక్ : ఫ్యాక్షనిజం

గుణశేఖర్: భారీ సెట్టింగులు

కోదండరామిరెడ్డి: చిరంజీవి, యండమూరి, ఇళయరాజా, లోక్ సింగ్ (ల కాంబినేషన్ )

యస్.వి. కృష్ణారెడ్డి: చిన్నపిల్లల హాస్యం

టి.కృష్ణ: తిరుగుబాటు

త్రివిక్రం శ్రీనివాస్: ప్రాస తో కూడిన ప్రయాస

బాపు: పదారణాల తెలుగుదనం,కొంటె చూపులూ, పెదవి విరుపులూ, పొడవాటి జడ ఇంకా చాలా...

రాఘవేంద్రరావు : అవసరమా? ఆహ, అవసరమా అని అడుగుతున్నా..

12 comments:

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

"రాఘవేంద్రరావు : అవసరమా? ఆహ, అవసరమా" this is super

మధు said...

మీరు తెలుగుచలనచిత్ర తురుపుముక్క 'తేజ ' ని మర్చిపోయారు. :))

krishna rao jallipalli said...

"రాఘవేంద్రరావు : అవసరమా? ఆహ, అవసరమా" ...అవసరం లేదు. 'బొడ్డూ' దాని పిల్లగాడికి కూడా తెలుసు.

ఉమాశంకర్ said...

@మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ గారు: Thank you

@ మధు గారు: అవును సుమా , ఎలా మర్చిపోయానబ్బా?

ఇదిగోండి..

తేజ: టై కట్టుకున్న ప్రిన్సిపాల్, ఎకసెక్కాలాడే లెక్చరర్లు, పన్నెండేళ్ళ వయసులో ముదురు ప్రేమలు...

ఉమాశంకర్ said...

@ కృష్ణారావు గారు: :) Thank you.

చొరవ తీసుకొని మీ వ్యాఖ్యని సవరిస్తున్నా

రాఘవేంద్రరావు : అవసరమా? ఆహ, అవసరమా" ...అవసరం లేదు. 'బొడ్డూ' డని పిల్లగాడికి కూడా తెలుసు. :)

నాగప్రసాద్ said...

పూరీజగన్నాథ్: హీరోయిన్ ని బూతులు తిట్టడం, హీరోయిన్ చేత బూతులు తిట్టించడం, తెలుగును ఖూనీ చేస్తూ కథలో కొంత భాగం తమిళంలోనో, మళయాలంలోనో.

శ్రీనువైట్ల: కొంచెం హింస, బూతుల్లేని చక్కని హాస్యం.

రాజమౌళి: హీరో మాత్రం ఏదో విధంగా ఖచ్చితంగా అనాథవుతాడు. హింస ఎక్కువే, కీరవాణి, ఇంకా ఏం చెప్పాలబ్బా?.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అవసరమా అహఁ అవసరమా, సరే బియ్యే ఏది??

ఉమాశంకర్ said...

@ నాగ ప్రసాద్ గారు:
మీరు చెప్పినవి బావున్నాయ్

శ్రీను వైట్ల అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది మాత్రం "మందు సీసా"

@రాజేంద్ర గారు: :) అవునండి డిగ్రీ మిస్సయింది. నిజమే ఆయన పేరు పక్క బియ్యే లేకపొతే అదేదో కొత్తగా ఉంది నాకిప్పుడు. బియ్యే ఉండాల్సిందే..

అలాగే దాసరి అంటే ఆయన సినిమాల సంగతి దేముడెరుగు, చిన్న మేఘం గుర్తొస్తుంది నాకు. ఆయన తనపేరుని అప్పట్లో అలాగే వేసుకునేవారు వాల్ పోస్టర్లో.

Anonymous said...

chakkani prayatnam aasinchinadi kaakapoyinaa aaswaadinchataginade - raamesababu

ఉమాశంకర్ said...

@రమేష్ బాబు గారు: :)

ఆశించినది అంటే? మీ అర్ధం దీనిమీద ఇంకొంచెం ఎక్కువ రాసి ఉండాలనా?

జీడిపప్పు said...

హ హ్హా బాగుంది బాగుంది. మంచి విశ్లేషణ.
చివర్లో నాభికేంద్రరావు గురించి చెప్పనే లేదు :)

ఉమాశంకర్ said...

@జీడిపప్పు గారు: మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు.
"ట్రేడు మార్కు" కదండీ , అవసరం లేదనిపించింది. :)

 
అనంతం - by Templates para novo blogger