సుహృద్భావ, స్నేహపూరిత సంభాషణ

Wednesday, October 22, 2008

ఇద్దరు ఎంపీ ల మధ్య జరిగిన సంభాషణ(??)

*********************************************

"ఆ! చెప్పావులే పెద్ద.."

"నువ్వు నాకు నీతులు చెప్తే వినాలి, నేను చెప్తే తప్పా?"

"ఎక్కువ మాట్లాడుతున్నావ్"

"ఎవడయ్యా? నువ్వా?నేనా?"

"ఇంక మాట్లాడింది చాలు నోర్మూసుకో"

"నువ్వే మూసుకో"

"నిన్న కాక మొన్నొచ్చావ్ నువ్వు నాకు చెప్పేటంతోడివయ్యావా?"

"ఏయ్ వాడు గీడు ఏంటి?మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం తెలీదా?"

"పోరా!, నీ మొహానికో మర్యాద కూడానా?"

"దమ్ముంటే బయటికి రా చూసుకుందాం"

"ఆ!పద, నువ్వు మగాడివో నేను మగాడినో తేల్చుకుందాం.."

**************************************************

ఇదండీ సంగతి. వాళ్ళిద్దరూ అంత చక్కగా మాట్లాడుకుంటే ఈ మీడియా ఏమిటండీ ఇలా ప్రతిదాన్నీ వివాదాస్పదం చేస్తోంది?

8 comments:

ravigaru said...

ఇప్పుడేం చూసారు రేపు ఒక bc mp ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అవమానించిన రాజగోపాల్ క్షమాప్పన చెప్పేదాకా అతనిని హైదరాబాద్ లో తిరగనివ్వం అంటూ statement లు వస్తాయి చూస్తూ ఉండండి.

ఉమాశంకర్ said...

@ravigaru:

ఇదొక "అరాచకీయం". ప్రజా సేవ పారిపోగా మిగిలిన residue

chaduvari said...

:) విశేషమేంటంటే..
ఈ సౌహార్ద్ర సంభాషణను తెదేపా విమర్శించింది. అదే రోజున వాళ్ళ ఎంపీ ఒకడికి కోర్టు జైలు శిక్ష ఖాయం చేసింది. (గతంలో ఓ పోలీసును కొట్టినందుకు) మహారాష్ట్రలో దౌర్జన్యాలు, హింసాయుత దాడులు చేయించినందుకు ఒకణ్ణి పట్టుకుని రిమాండుకు పంపారు. అంతకు ఓ రోజు అటో ఇటో.. దొంగ పాసుపోర్టు సృష్టించినందుకుగాను ఓ లోక్‌సభ సభ్యుణ్ణి సభనుంచి సస్పెండో మరోటో చేసారు.

మురికెదవలు రాజకీయాల్లోకి దిగుతున్నారో, దిగాక మురికి అవుతోందోగానీ..

Anonymous said...

ఇంకో విశేషం ... ఒక తెలంగాణా ఎంపీని ఆంధ్రా ఎంపీ అవమానించాడని తెలంగాణా వాదులు అప్పుడే (వితండ) వాదం కూడా మొదలుపెట్టారు ... వాడిని వీడు తిడితే వీడిని వాడు కూడా తిట్టాడు కదా ... :)

- Shiv.

ఉమాశంకర్ said...
This comment has been removed by the author.
ఉమాశంకర్ said...

@చదువరి, Shiv

ఏ పార్టీ అయినా అదేతంతు. చూసి చూసి మనకి విరక్తి కలగాల్సిందే. వాళ్ళకు మాత్రం అలుపూ సొలుపూ ఉండదు,ఆలోచన అసలేమాత్రం ఉండదు.

ఉమాశంకర్ said...
This comment has been removed by the author.
ఉమాశంకర్ said...

Why same comment of mine appeared thrice? is it a kind of spam?????

 
అనంతం - by Templates para novo blogger